తెలుగు సాహితీవనం కవితల పోటీ: 33 అంశం: "నది మదిలో" గడువు: 18.09.20


 

🍂🌿🌿 🍂🌿🌿 🍂🌿🌿 🍂 🌿🌿🍂

మిత్రులందరికీ కవితల పోటీకి సుస్వాగతం....💐


తెలుగు సాహితీవనం కవితల పోటీ: 33

అంశం:   "నది మదిలో"

గడువు: 18.09.20

ఫలితాలు: 20.09.20


ఈ సమూహంలో ఇంత వరకు మనం 32కవితల పోటీలు నిర్వహించుకున్నాం...అక్షర సవ్వడి సాహిత్య పోటీలను 3 నిర్వహించుకున్నాం... 


ఈరోజు మనం నిర్వహించుకుంటున్న కవితల పోటీకి అంశం : "నది మదిలో..."


నది తన మదిలో ఏమనుకుటోంది...మనకు ఏం చెప్పాలనుకుంటోంది....

ఈ విషయం పై మీ కవితాక్షరాలు పరుగులు తీయాలి....ఓ నదిలా...😊  


మీ భావాలను చక్కని భావకవిత్వం లోనైనా వెళ్ళడించండి లేదంటే సామాజిక అంశంగానైనా మలచండి....మీ ఇష్టం....


నదులన్నీ మన సాహితీవనంలో పోటీ పడుతూ ప్రవహించాలి....


చక్కని ఈ "నది మదిలో...." పోటీకి బహుమతిగా మరి మీ ముందుకు వస్తోంది మాడిశెట్టి శ్రీనివాస్ గారి "గుండెల్లో గోదారి"....మీ గ్రంథాలయంలోకి మరి ఈ కవిత్వ సంపుటిని ఆహ్వానించండి...


బహుమతులు:


5 గురు ఉత్తమ కవితా విజేతలకు  "గుండెల్లో గోదారి" కవిత్వ సంపుటాలను బహుమతులుగా అందజేస్తున్నాము.ఈ పుస్తక బహుమతులను అందజేయువారు ప్రముఖ కవి శ్రీ మాడిశెట్టి శ్రీనివాస్ గారు....


వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు...💐💐


పోటీకి ఇంత మంచి అంశాన్ని సూచించిన "తాడిమేటి సూర్య ప్రకాశరావు" అన్నయ్యకి నమస్సులు.... 💐


పోటీ నిబంధనలు:


1.వచన కవిత సుమారు 14 నుండి 20 పంక్తులు (వాక్యాలు) ఉండాలి.

పంక్తి కి 6 పదాలు మించకూడదు.


2. గడువు తేదీ: 18.09.20 రాత్రి 11 గంటలు వరకు


3. ఒకరు ఒక కవిత (వచన కవిత్వం) మాత్రమే  రాయాలి.


4.అక్షర దోషాలు లేకుండా ఉండాలి


5.మీ కవితకు తప్పకుండా  శీర్షిక ఉండాలి.


6.కవిత చివర హామీ పత్రం ఉండాలి.


7.మేము ఫలితాలు ప్రకటించే వరకు మీరు మీ కవితలను వేరే ఎక్కడ ప్రచురించ కూడదు.


8.ఇది వరలో ఎక్కడా ప్రచురితమైన కవితను ఇక్కడ  పెట్టకూడదు.


9.ఫలితాలు పూర్తిగా న్యాయ నిర్ణేతలకు సంబంధించినది. కాబట్టి వాద ప్రతివాదాలకు తావులేదు.


10.పోటీ జరుగుతున్న ఈ పోస్ట్లో మీ కవితలను  తప్ప ఏ ఇతర కామెంట్లు పెట్టకూడదు.


పోటీకి 4 రోజులు సమయం ఇచ్చినందున అక్షర దోషాలు లేకుండా నిబంధనలను పాటిస్తూ చక్కని కవితలను మలచి ఇక్కడే కామెంట్ పెట్టే చోట పేస్ట్ చేయండి....


గమనిక : వచన కవిత మాత్రమే పెట్టండి. వేరే ఏ ఇతర ప్రక్రియ వద్దు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. పోటీకి సూచించిన నియమాలను తప్పకుండా అందరూ పాటించాలి....


మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు...💐💐


తెలుగు సాహితీవనంలోని సభ్యులందరి తరపున శ్రీ మాడిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.🙏💐


     ఇట్లు

కార్య నిర్వాహక బృందం

తెలుగు సాహితీ వనం

ఈ లింక్ ద్వారా ఫేస్బుక్ కామెంట్ బాక్స్ లో మీ కవితను పోస్ట్ చేయాలి. https://m.facebook.com/groups/1318818648209943?view=permalink&id=3238653572893098&sfnsn=wiwspmo&extid=PqGpB4TdEDAJFZnA

సేకరణ:ఫేస్బుక్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు