మీ 'స్వరాన్ని' వినిపించండి 'కవిత(kavithalu.in)'ల్లో...

అంతర్జాలంలో మీ కవితలు రాయడానికి,అదేవిధంగా ఇతర తెలుగు సాహితీ మిత్రులు రాసినవి చదవడానికి వేదికగా నిలిచింది 'స్వరం కవితలు డాట్ ఇన్(kavithalu.in)'.


  సమాజము కోసం,సమాజంలో నుంచి సాహిత్యం జనిస్తుంది.తెలుగు సాహిత్యంలో కవితా ప్రక్రియకు విశిష్ట స్థానం ఉన్నది.డా. సినారె గారు అన్నట్లు 'కప్పి ఉంచితే కవిత్వం'.వివిధ రచయితలు లేదా ఒకే రచయితకు సంబంధించిన కవితా సంకలనాలు అనేక వచ్చి ఉన్నాయి.అయితే తమ కవితలను పుస్తకాల్లో ప్రచురించే అవకాశం అందరికీ రాకపోవచ్చు.ఇలాంటి వారి కోసమే kavithalu.in వారు తమ కవితలను వెబ్సైట్ లో ప్రచురించడానికి అవకాశం కల్పిస్తుంది.ఈ అవకాశాన్ని సాహితీమిత్రులు ఉపయోగించుకోగలరు.

 అదేవిధంగా ఈ వెబ్సైట్ లో కవితాభిమానులు,సాహిత్యాభిమానుల కోసం వివిధ అంశాలపై ఉన్న కవితలు,సామెతలు,పద్యాలు,కథలు, ధర్మ సందేహాలు,చలనచిత్ర సమీక్షలు తదితర సాహిత్య విభాగాలకు చెందినవి అందుబాటులో ఉన్నాయి.

సామాజిక మాధ్యమాల ద్వారా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,ట్విట్టర్ కూడా సాహితీ సేవలు అందిస్తున్నారు.

వెబ్సైట్:https://kavithalu.in





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు