తెలుగు పుస్తకాలు చదవాలనుకునే వారికి ఉత్తమ 10 అంతర్జాల నెలవులు

 


1. తెలుగు వికీసోర్స్ https://te.m.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
ఇక్కడ కాపీరైట్ పరిధి దాటిన పుస్తకాలు లేదా రచయితలు/ప్రచురణకర్తలు క్రియేటివ్ కామన్స్ లైసెన్సు లో విడుదల చేసిన పుస్తకాలు ఉంటాయి.

2.ఫ్రీ గురుకుల
https://www.freegurukul.org
ఇందులో 3,471 తెలుగు పుస్తకాలు పిడిఎఫ్ రూపంలో లభిస్తాయి.

3. సత్యకామ్.కామ్
https://sathyakam.com/
ఇక్కడ రచయితల అనుమతితో వెబ్ లో చదవడానికి మాత్రమే అవకాశముండేలా కొన్ని పుస్తకాలున్నాయి(కవర్ పేజ్ కనబడే పుస్తకాలే ప్రస్తుతం చదవగలం. కవర్ పేజ్ కనిపించని పుస్తకాలు సాంకేతిక సమస్యల వలన కనపడవు.)

4. ఇంటర్నెట్ ఆర్కైవ్
https://archive.org/details/texts?&and[]=languageSorter%3A%22Telugu%22
ఇక్కడ తెలుగులో నలభై రెండు వేలకు మించి పాత పుస్తకాలున్నాయి.

5. గూటెన్బర్గ్ ప్రాజెక్ట్
https://www.gutenberg.org/browse/languages/te
ఇక్కడ ఒక ఆరు తెలుగు పుస్తకాలు ఉంటాయి.

6. తెలుగువన్ గ్రంథాలయం https://www.teluguone.com/grandalayam/amp/
ఇక్కడ చాలా పుస్తకాలు - కథలు, నవలలు అందుబాటులో ఉంటాయి.

7. కథానిలయం
https://kathanilayam.com/
కారా మాస్టారు గారి శ్రీకాకుళంలో ఉన్న కథానిలయానికి వెబ్ లో ప్రతిరూపం. కథలు వెతికేప్పుడు పిడిఎఫ్ అందుబాటులో ఉంటే పిడిఎఫ్ బొమ్మ కనిపిస్తుంది. నలభై ఐదు వేల కథలు చదివే వీలుంది.

8. కినిగె ఉచిత పుస్తకాలు
https://kinige.com/free
కినిగెలో ఉచితంగా చదువుకునేందుకు రెండు వేలకు పైగా పుస్తకాలున్నాయి. వీటిల్లో చాలా అపురూపమైన కథల పుస్తకాలు, నవలలు, వ్యాసాలు ఉన్నాయి.

9. ఈమాట జాలపత్రికలో పుస్తకాలు
http://www.eemaata.com/books/library.html

10.కౌముది జాలపత్రికలో పాత సంచికలను సంచికలవారీగా నెల నెలా చదవవచ్చు, లేదా రచయిత/రచన ఆధారంగా ఉన్న పిడిఎఫ్ల నుంచి చదువుకోవచ్చు.
ఆ సంచికలలో ఎన్నో ప్రసిద్ధ నవలలు, కథలు దాగున్నాయి.
https://www.koumudi.net/library.html
https://www.koumudi.net/monthly_copies.html

ఇంకా ఇలాంటి అంతర్జాల వనరుల గురించి తెలుసుకోవాలంటే నేను రాసిన తెలుగు సాహిత్యం-అంతర్జాల వనరుల వినియోగం అనే వ్యాసాన్ని     
https://drive.google.com/file/d/1qUi0iyK4J_gkbwwTyu1TY5Y-aI3v6zkK/view?usp=drivesdk చదివే ప్రయత్నం చేయండి.మన eteluguindia.blogspot.com ని అనుసరించండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు