ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రిక ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా
“గళం విప్పిన కలం” ఇ-కవితా సంకలనం కోసం రచనలకు ఆహ్వానం
స్థలం: అంతర్జాల వేదిక
ప్రక్రియ: వచన కవిత
అంశం: “ప్రత్యేక తెలంగాణాలో ప్రజాజీవితం”
తేదీ: 28/05/2021, సమయం: ఉ.06:00 - రా.10:00
(ఉత్తమ కవితలు రచించిన వారికి ఇ-ప్రశంసాపత్రాలు జూన్2, 2021న అందజేయడం జరుగుతుంది.)
నియమ నిబంధనలు:
1. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. రచనలు చేసేవారు మాత్రమే ఈ గ్రూప్ నందు చేరాలి.
2. రచనలు మంచి ఎత్తుగడతో దీర్ఘ వాక్యాలు లేకుండా, 15-20 వరుసల లోపు లేదా 100 పదాలు మించకుండా వుండాలి. లేనిచో పరిశీలనకు తీసుకోబడవు.
3. అక్షర దోషాలు లేకుండా సరిచూసుకొని, ఏ వరుసలో పదాలు ఎంత వరకు వుండాలో చూసి తెలుగులో టైపు చేసి పంపాలి.
4. రచనల ఎంపికలో తుదినిర్ణయం నిర్వాహకులదే. ఎలాంటి వాదోపవాదాలకు, విమర్శలకు తావులేదు.
5. ఎంపిక మరియు ప్రచురణ విషయంలో ఎలాంటి సంప్రదింపులు జరుపవద్దు.
6. ప్రశంసాపత్రం కొరకు ఫోటో పంపండి.
7. వివాదాస్పద అంశాలపై రచనలు చేయకూడదు. రచనలు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ఒకవేళ అలాంటి రచనలు చేస్తే వాటి వివాదాల పూర్తి బాధ్యత ఆరచయితలదే.
కవితలు…
1. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు.
2. రాజకీయాలకు అతీతంగా వుండాలి.
3. తెలంగాణా ప్రజల మనోగతాన్ని కవిత ద్వారా పలికించాలి.
4. కవితలు ప్రజా జీవితానికి అద్దం పట్టేవిగా వుండాలి.
ప్రవాహిని
అంతర్జాల సాహితీ పత్రిక
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
0 కామెంట్‌లు