About Telugu Language

 

తెలుగు భాష

తెలుగు ప్రాచీనత:

‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ గా ప్రసిద్ధికెక్కిన తెలుగు భాష అత్యంత ప్రాచీనమైన భాషలలొ ఒకటి.తెలుగు భాషకి సమానార్థకాలుగా ఆంధ్రం,తెలుగు,తెనుగు ను ఉపయోగించడం జరిగినది.తెలుగు భాష యొక్క ప్రాచీనతను తెలుసుకోవాలంటే ఆంధ్రం-తెలుగు-తెనుగు పదాలను జాతి-భాషా-దేశ వాచకంగా పరిశీలించాలి.

అ)ఆంధ్ర:

 ‘ఆంధ్ర’పదం భారతీయ వాజ్మయంలో జాతిపరంగా,దేశపరంగా అత్యంత ప్రాచీనమైనది.అందునా అది మొదట వేదకాలంలోనే జాతిపరంగా  పేర్కొనబడి,పిదప కాలక్రమంలో ‘ఆంధ్రజాతి’ ప్రజలకు నివాసమైన ప్రదేశాన్ని ఆంధ్ర దేశమనుట జరిగినది.తర్వాత నన్నయ కాలం నుండి ‘ఆంధ్ర’పదం భాషాపరంగా కూడా ప్రసిద్ధమైంది.

ఆ)తెలుగు:

Ø  నన్నయ కాలము నుండి ‘ఆంధ్ర పదానికి తెలుగు,తెనుగు పదాలు పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి.క్రీ.శ.1000కి పూర్వము వాజ్మయంలో గాని,శాసనాలలో గాని తెలుగు,తెనుగు పదాలు అంతగా కనపడవు.

Ø  క్రీ.శ.11వ శతాబ్దం ఆరంభంలో శాసనాలలో ‘తెలుగు’ జనవాచకముగా,జాతి వాచకంగా ప్రయోగించినట్లు కొందరు చరిత్రకారుల భావన, ఉదా: “తెలుంగు భూపాలురు”, “తెలుంగదమల్లి” మొదలైన వాటిచే తెనుగు కంటే తెలుగే ప్రాచీన రూపమని తెలుస్తోంది.

Ø  త్రిలింగ శబ్దము నుండే తెలుగు పుట్టినదని,విధ్యానాధుడు చెప్పినట్లు శ్రీశైలం,ధ్రాక్షారామం,కాళేశ్వరం అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య ఆంధ్రభూమి ఉండుటచే ఇది త్రిలింగదేశమైనదని పండితుల భావన.

Ø  గ్రీక్ భూగోళ శాస్త్రజ్ఞుడు తన గ్రంథంలో ‘ట్రిలింగాన్’ పదం వాడియుండగా,బర్మాలో తలైంగ్ జాతి ప్రజాలున్నట్లు తెలుస్తోంది.ఈ  తలైంగ్ ‘తిలింగ’గా సంస్కృతీకరించబడినదని కొందరి భావన.

Ø  శ్రీకృష్ణదేవరాయలు ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని ప్రకటించెను.

ఇ)తెనుగు:

Ø  ‘తెనుగు’ పదము నన్నయచే మొదటిగా ప్రయోగించబడింది.

Ø  రాజరాజనరేంద్రుడు సంస్కృత భారతాన్ని ‘తెనుగున రచియింపు మధికధీయుక్తిమెయిన్’ అన్నట్లుగా నన్నయ పేర్కొనుటలో ‘తెనుగు’ భాషా వాచకమే నన్నయ,తిక్కన ఇద్దరూ ‘తెలుగుతో పాటు తెనుగు’ పదాన్ని కూడా బాగా వాడారు.

Ø  ‘తెనుగు’ పదము ‘త్రినగ’, శబ్ద భవమని కొందరి పండితుల భావన. అనగా శ్రీశైలం,శ్రీకాళహస్తి,మహేంద్రగిరి అనేవే త్రినగాలని, ఆ మధ్య ప్రాంతమే తెలుగు దేశము అయిందని వారి భావం.కానీ త్రిలింగ శబ్దమంత ప్రసిద్ధమైంది కాదు త్రినగ శబ్దం.

Ø  ‘తెన్’ అనగా దక్షిణమని వింధ్య పర్వతానికి దక్షిణంగా ప్రయాణించి,నివసించే వీరు ‘తెనుగు’ వారు అయ్యారని కొందరి వాదన.

Ø  ‘తేనె+అగు’-తేనె వంటి భాష కనుక ఇది ‘తెనుగు’ అని గ్రియర్సన్ వంటి పండితుల అభిప్రాయం.

Ø  ‘తెలుగు’లోని ‘ల’ కారము జన వ్యవహారములో ‘న’ కారముగా మారి ‘తెనుగు’

Ø  భాషా వాచకముగా ప్రసిద్ధమైన ‘తెనుగు’-నేడు దేశపరంగా ‘తెనుగు దేశము’గా కూడా వ్యవహారంలో వచ్చింది.

Ø  తెనుగు కంటే తెలుగు ప్రాచీనమని,కాలక్రమంలో తెనుగు ఏర్పడినదని భావించవచ్చు.

ఇలా ఆంధ్రము,తెలుగు,తెనుగు ఎలా ఉపయోగించిన తెలుగు అంత్యంత ప్రాచీనమైనది అని తెలుస్తుంది.

ఆంధ్ర సాహిత్య చరిత్ర-యుగవిభజన:

తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం చేయడం కోసం ఎందరో ప్రముఖులు కొన్ని యుగాలుగా విభజించారు.అయితే అందులో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు చేసిన యుగ విభజన అందరి చేత ఆమోదం చెంది విశేష ఆదరణకు నొచుకున్నది.

 

v  ప్రాగ్నన్నయ యుగం:క్రీ. పూ. 200 క్రీ.శ.1000 వరకు

v  నన్నయ యుగం : క్రీ.శ.1000-క్రీ.శ. 1100 వరకు

v  శివకవి యుగం : క్రీ.శ.1100-క్రీ.శ. 1225 వరకు

v  తిక్కన యుగం : క్రీ.శ. 1225-క్రీ.శ. 1320 వరకు

v  ఎర్రన యుగం : క్రీ.శ.1320-క్రీ.శ. 1400 వరకు

v  శ్రీనాథ యుగం : క్రీ.శ.1400-క్రీ.శ. 1500 వరకు

v  ప్రబంధ యుగం : క్రీ.శ.1500-క్రీ.శ. 1600 వరకు

v  దక్షిణాంధ్ర యుగం : క్రీ.శ.1600-క్రీ.శ. 1775 వరకు

v  క్షీణ యుగం : క్రీ.శ.1775-క్రీ.శ. 1875 వరకు

v  ఆధునిక యుగం : క్రీ.శ.1875 -నేటి వరకు

తెలుగు అంకెలు

పేరు

తెలుగుసంఖ్య

ఇండో అరబిక్ అంకెలు

సున్నా

0

0

ఒకటి

1

రెండు

2

మూడు

3

నాలుగు

4

ఐదు

5

ఆరు

6

ఏడు

7

ఎనిమిది

8

తొమ్మిది

9

తెలుగు అంకెలు, సంఖ్యలు తెలుగు కేలెండర్ లో ప్రధానంగా వాడుతారు. ఇతరత్రా ఇండో అరబిక్ రూపాలనే వాడుతారు.

మాండలికాలు:

తెలుగు భాషలో ప్రాంతాల ఆధారంగా నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.

v  1. సాగరాంధ్ర భాష: కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషని కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.

v  2. రాయలసీమ భాష: చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ప్రాంతపు భాషని రాయలసీమ మాండలికం అంటారు.

v  3. తెలంగాణ భాషతెలంగాణ ప్రాంతపు భాషని తెలంగాణ మాండలికం అంటారు.

v  4. కళింగాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషని కళింగాంధ్ర మాండలికం అంటారు.

తెలుగు భాష ప్రత్యేకతలు:

Ø  తెలుగు భాష భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలలొ ఒకటి.

Ø  భారత దేశంలో హిందీ తరువాత అత్యధికంగా ప్రజలు మాట్లాడుతున్న భాష తెలుగు.

Ø  తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా తెలుగు ఉంది.