కూకట్ల తిరుపతి-(కవులు-రచయితల పరిచయ కార్యక్రమం)

 

కూకట్ల తిరుపతి



తల్లిదండ్రులు: కూకట్ల అంకవ్వ-కనకయ్య

వృత్తి:తెలుగు భాషోపాధ్యాయులు

కలం పేరు: కూతి

విద్యార్హతలు :ఎం. ఏ. తెలుగు సాహిత్యం. తెలుగు పండిత ప్రశిక్షణ, ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కళాశాల, వరంగల్.

చరవాణి :9949247591

మెయిల్ ఐడి:kukatlathirupathi75@gmail.com

జన్మ స్థలం:గ్రామం: మద్దికుంట, మండలం: మానకొండూర్

నివాసం-జిల్లా:కరీంనగర్

రాష్ట్రం:తెలంగాణ

సాహిత్యం ప్రవేశం:1995

రచనలు-ముద్రితాలు:  

1. మేలుకొలుపు వచన కవిత్వం - 2005 2. చదువులమ్మ శతకం - 2006 3. పల్లె నానీలు - 2007 4. ఎర్రగాలు వచన కవిత్వం - 2015 5. ఆరుద్ర పురుగు వచన కవిత్వం. – 2015 మరియు వివిధ సంకలనాలు, పలు పత్రికలలో పద్యాలు, కథలు, వ్యాసాలు, కవిత్వం ప్రచురితం చేశారు. సంపాదకత్వం : 1. "నల్లాలం పూలు" గంగారం బడి పిల్లల కవిత్వ సంకలనం - 2018 2. "సోపతి" ఎన్నీల ముచ్చట్లు ఐదేండ్ల పండగ ప్రత్యేక సంచిక. 3. బాల సాహిత్య కవితా సంకలనం 4. స్త్రీవాద కవితా సంకలనం 5. బుద్ధ జయంతి కవితా సంకలనం 6. మానేటి కైతల ఊట-సినారె స్మృతి కవిత్వ సంకలనం 7. మచ్చ ప్రభాకర్ యాది కవితల సంకలనం 8. గుట్టల విధ్వంస వ్యతిరేక కవిత్వం మొదలైన ప్రత్యేక కవితా సంకలనాలతో పాటు మరికొన్ని పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.

అముద్రితాలు: 
1. "జల్లెడ" ఎన్నీల ముచ్చట్లు సమీక్షావ్యాసాలు.
2. కట్లపువ్వు కవిత్వం 3. ఖండ కావ్యం 4. కరీంనగర్ కందాలు 5. కథలు 6. వ్యాసాలు
                                  
సాహిత్య సేవ-విశేషాలు:
1. తెలుగు భాషా పరిరక్షణ సమితి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా కొంతకాలం పని చేశారు.
2. తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా ఉద్యమకాలంలో సేవలందించారు. 3. కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య-సాహితీ గౌతమి కార్యదర్శిగా పనిచేసి, ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. 4. తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భావం నుండి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా సేవలందించారు. కొన్నాళ్ళు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
తెలుగు భాషా సాహిత్యాల పరిపుష్టం కోసం… Kukatla Thirupathi యూట్యూబ్ చానల్ (https://www.youtube.com/c/kukatlathirupathi) నిర్వహణ. ఇప్పటికీ సుమారు మూడు వందల పైచిలుకు వీడియో పాఠాలు అందుబాటులో ఉంచారు.
అవార్డులు-పురస్కారాలు:

1. 'జిల్లా ఉత్తమ యువకవి పురస్కారం - 2006' జిల్లా యువజన సంక్షేమ శాఖ, కరీంనగర్. 2. 'కీ. శే. మామిడిపల్లి సాంబశివ శర్మ స్మారక సాహిత్య పురస్కారం - 2007' జిల్లా రచయితల సంఘం, కరీంనగర్. 3. 'విశిష్ట కళాలయ రాష్ట్ర స్థాయి పద్య కవితా పురస్కారం - 2008' పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. 4. 'గ్రామీణ కళా జ్యోతి పురస్కారం - 2009' నెహ్రూ యువకేంద్రం మరియు ఫోక్ ఆర్ట్స్ అకాడమి కరీంనగర్. 5. 'తెలంగాణ సాహిత్య పురస్కారం - 2010' తెలుగు భాషా సంరక్షణ సంఘం, జగిత్యాల. 6. 'కాళోజీ స్మారక సాహిత్య పురస్కారం - 2012' సాహిత్య, సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్. 7. 'జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ సత్కారం - 2012' ఆపస్, కరీంనగర్ జిల్లా. 8. 'డాక్టర్ పద్మభూషణ్ గుర్రం జాషువా పద్య కవితా పురస్కారం - 2013' తెలుగు అకాడమి, హైదరాబాద్. 9. 'శ్రీ జయనామ ఉగాది ప్రశంసా పురస్కారం - 2014' శ్రీ సారస్వత జ్యోతి మిత్ర మండలి కరీంనగర్. 10. 'మానకొండూర్ మండల ఉత్తమ సాహితీ వేత్త - 2015' రూ.10,000 నగదు పురస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 11. 'సినీవాలి పురస్కారం - 2017' జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్(రి), హైదరాబాద్. 12. 'తెలంగాణ సాహితీ పురస్కారం - 2018' శ్రీలలిత కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్. 13. 'సాహితీ జ్యోతి రత్న - 2018' జయహో ఆర్గనైజేషన్, కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్ట్, వరంగల్. 14. 'కనకం కళా పురస్కార్ - 2018' కనకం సేవా సంస్థ, కరీంనగర్ జిల్లా. 15. 'తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం - 2019' శ్రీదివ్య సంజీవని హనుమదాశ్రమం, ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా. 16. 'బి. ఎస్. రాములు స్ఫూర్తి పురస్కారం - 2019' విశాల సాహిత్య అకాడమి, హైదరాబాద్. 17. 'డా. చింతోజు బ్రహ్మయ్య-బాలమణి బాల ప్రతిభాపురస్కారం-2019' ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా. 18. 'అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం-2021' రూ. 5000 నగదు. తెలంగాణ రచయితల వేదిక - కరీంనగర్ జిల్లా శాఖ.         ప్రపంచ తెలుగు మహాసభలు, కవి సమ్మేళనాలు, సాహిత్య సభలు, సమావేశాలలో పలు సన్మాన సత్కారాలు పొందారు.


మరిన్ని విశేషాలు:
రంగస్థల కళారంగం: 1. "చంద్రహాస విలాసం" - కుళింద మహారాజు, వీరసేనుడు. 2. "సుగ్రీవ విజయం" -  సుగ్రీవుడు. 3. "భక్త మార్కండేయ" - వశిష్ఠుడు, చిత్రగుప్తుడు. 4. "సత్య హరిశ్చంద్ర" - వశిష్ఠుడు, నక్షత్రకుడు. 5. "చిరుతల రామాయణం" భరతుడు. మద్దికుంట యువజన సంఘాలు: 1. అభ్యుదయ యువజన సంఘం. వ్యవస్థాపకులు. 2. సిద్ధార్థ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్. సలహాదారులు.
చిత్రాలు:

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సన్మానం
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సన్మానం

అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి కూకట్ల తిరుపతి గారు రాసిన వ్యాసం 


అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారం-2021 



                                                        తెలంగాణ సాహితీ పురస్కారం-2018 



గమనిక:తెలుగు భాషా,సాహిత్యాలలో కృషి చేస్తున్న వారి గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం.రచయిత అందించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా చేసుకొని మన 'e-తెలుగు' బ్లాగ్ లో ప్రచురిస్తున్నాం.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు