పరిశోధక మిత్రులకు నమస్కారం. తెలుగులో జానపదవిజ్ఞానం సేకరణ/అధ్యయనం ప్రారంభమయి రెండువందల ఏండ్లు దాటింది. శిష్ట సాహిత్యంలో, గాథాసప్తశతి, తొల్కాప్పియంలో తెలుగు వారి ఆనాటి జీవనవిధాన పరామర్శ ఉంది. జీవనవిధానం పారే ఒక ఏరు లాంటిది. దేశ కాల స్థితిగతులకు అనుగుణంగా మారడం దాని స్వభావం. ఆ వైవిధ్యాన్ని గుర్తించి అధ్యయనం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. బహుముఖీనమయిన జానపదవిజ్ఞాన విరాట్ స్వరూపాన్ని, వాటిమీద జరిగిన అధ్యయన వైవిధ్యాన్ని కనీసం నూరు వ్యాసాలతో ఒక చోట చేర్చి పుస్తక రూపంలో తీసుకరావాలని కోరిక. అందుకోసం జానపదవిజ్ఞానం తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఈ యజ్ఞంలో పాల్గొని మీకు ఇష్టమైన అంశం మీద వ్యాసం రాయాలని కోరుకొంటున్నాను. 
నా దగ్గర అందరి నంబర్లు లేవు. ముందుగా మీ వాట్సప్ ఫోన్ నంబరు, ఇ మెయిల్, మీ వ్యాసం పేరు సూచిస్తూ 9440170703 వాట్సప్ నంబరుకు పంపవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీకు తెల్సిన మిత్రులందరికీ తెలియజేయవలసిందిగా కోరుకొంటున్నాను. శుభాకాంక్షలతో, భక్తవత్సల రెడ్డి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు