తెలుగు కథకు నీరాజనం... కథా విజయం 2020
తెలుగువెలుగు, బాలభారతం, విపుల, చతుర మాసపత్రికల ద్వారా మన అమ్మ భాషకు, సాహిత్యానికి పట్టం కడుతున్న రామోజీ ఫౌండేషన్, రచయితల్ని ప్రోత్సహించేందుకు కథావిజయం పేరుతో పోటీలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. 2019లో మొదలైన ఈ పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ ‘కథా విజయం 2020’ పోటీలకు రచనలను ఆహ్వానిస్తున్నాము. ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్, ఈ.ఎఫ్.ఎం, ఉషాకిరణ్ మూవీస్ సంస్థలు ఈ యజ్ఞంలో భాగస్వాములుగా వ్యవహరిస్తాయి.
బహుమతులు:
* ప్రథమ: ఒక అత్యుత్తమ కథకు: రూ.25,000
* ద్వితీయ: 2 ఉత్తమ కథలకు ఒక్కోదానికి రూ.15 వేలు
* తృతీయ: రూ.10 వేల చొప్పున 3 బహుమతులు
* ప్రత్యేకం: రూ.5 వేల చొప్పున 5 బహుమతులు
* ప్రోత్సాహక: రూ.3 వేల చొప్పున 20 బహుమతులు
* కథల స్వీకారం ప్రారంభం: అక్టోబరు 5
* కథల సమర్పణకు తుది గడువు: నవంబరు 15, 2020
* ఫలితాల వెల్లడి: 31.12.2020
* బహుమతి కథల ప్రచురణ: జనవరి, 2021 సంచికల నుంచి
నిబంధనలు:
* కథ 2500 పదాలకు మించకూడదు. తెలుగువెలుగు.ఇన్‌లో నిర్దేశించిన లింక్ ద్వారా మాత్రమే కథ పంపాలి. తపాలా, మెయిల్, వాట్సప్‌లో వచ్చే కథలు స్వీకరించడం సాధ్యం కాదు.
* కథ మీద రచయిత పేరు, వివరాలు ఉండకూడదు. తెలుగువెలుగు.ఇన్ ద్వారా కథను పంపేటప్పుడు అక్కడే మీ పేరు, ఇతర వివరాలు నమోదు చేయడానికి విడివిడిగా నిర్దేశిత ప్రదేశాలుంటాయి. వాటిలో మీ కథ పేరు, ఇతర వివరాలు నింపాలి. అక్కడే అంగీకారపత్రమూ ఉంటుంది. దాన్ని టిక్ చేయాలి.
* రచనలో తెలుగు నుడికారం ఉట్టిపడాలి. మాండలిక కథలనూ పంపించవచ్చు. కథలు మూసపద్ధతిలో ఉండకూడదు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా వస్తువు నవ్యంగా ఉండాలి. కథ పాఠకుల మీద గాఢమైన ముద్రవేయాలి. కులం, మతం, ప్రాంతం, స్త్రీలు, వైకల్యాలను కించపరిచే పదజాలం, భావాలు ఉండకూడదు.
* ఒకరు రెండు కథలకు మించి పంపకూడదు.
* గతంలో ఎక్కడైనా, ఏ రూపంలో అయినా ప్రచురితమైనవి, చోరీ కథలను పంపకూడదు. ఇలాంటి కథను పంపిన రచయితల పేర్లు, వివరాలను మా పత్రికల్లో ప్రకటిస్తాము. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది ఈ పోటీలో పాల్గొనకూడదు.
* పోటీ ఫలితాలను ఈనాడు దినపత్రిక, ఈటీవీ, ఈటీవీ భారత్, ఈనాడు.నెట్, ఈనాడు ఎఫ్.ఎంలలో వెల్లడిస్తాము. ఎంపికైన కథలను ఈనాడు ఆదివారం అనుబంధం, తెలుగువెలుగు, విపుల, చతుర పత్రికల్లో ఎందులోనైనా వీలువెంబడి ప్రచురిస్తాము.
* పోటీకి సంబంధించి ఎలాంటి విచారణలు, ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
* నియమ నిబంధనలను ముందుగా తెలియజేయకుండా మార్చే, లేదా పోటీలను రద్దు చేసే అధికారం నిర్వాహకులకు ఉంటుంది
సేకరణ:తెలుగు వెలుగు
0 కామెంట్‌లు