పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం-అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020)-2021 జనవరి 19, 20 & 21


తెలుగు అధ్యయన శాఖ
బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు&
నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యూ.ఎస్.ఏ
సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్
అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020)
2021 జనవరి 19, 20 & 21 తేదీలలో
ఈ సదస్సులో పాల్గొనేవారు ఈ క్రింది అంశాలలో మీకు నచ్చిన ఏ అంశాన్నైనా ఎన్నుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు.
అంశాలు:
1. తెలుగు కవిత్వం – వస్తు, రూప పరిణామం (2000-2020)
1.1 పద్య కవిత్వం
1.2 వచన కవిత్వం
1.3 మినీ కవిత్వం, హైకూలు, రెక్కలు
1.4 దీర్ఘ కవిత్వం
2. తెలుగు కథ – వస్తు, రూప పరిణామం (2000-2020)
2.1 రాయలసీమ కథా సాహిత్యం
2.2 తెలంగాణ కథా సాహిత్యం
2.3 ఉత్తరాంధ్ర కథా సాహిత్యం
3. తెలుగు నవల – వస్తు, రూప పరిణామం (2000-2020)
3.1 రాయలసీమ నవలా సాహిత్యం
3.2 తెలంగాణ నవలా సాహిత్యం
3.3 ఉత్తరాంధ్ర నవలా సాహిత్యం
4. అస్తిత్వవాద సాహిత్యం - వస్తు, రూప పరిణామం
(2000-2020)
4.1 రాయలసీమ అస్తిత్వవాద సాహిత్యం
4.2 తెలంగాణ అస్తిత్వవాద సాహిత్యం
4.3 ఉత్తరాంధ్ర అస్తిత్వవాద సాహిత్యం
5. జానపద&గిరిజన సాహిత్యం - వస్తు,రూప పరిణామం
(2000-2020)
5.1 జానపద&గిరిజన కథా సాహిత్యం
5.2 జానపద &గిరిజన గేయ సాహిత్యం
6. ప్రపంచీకరణ తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం
(2000-2020)
6.1 ప్రపంచీకరణ కథా సాహిత్యం
6.2 ప్రపంచీకరణ నవలా సాహిత్యం
6.3 ప్రపంచీకరణ కవిత్వం
7. డయాస్పోరా తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం
(2000-2020)
7.1 ప్రవాసాంధ్రుల కవిత్వం
7.2 ప్రవాసాంధ్రుల కథా సాహిత్యం
8. అంతర్జాల తెలుగు పత్రికాసాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020)
8.1 అంతర్జాల స్త్రీవాద పత్రికలు – నెచ్చెలి, విహంగ మొ.వి.
8.2 అంతర్జాల పత్రికలు–కౌముది, సారంగ, ప్రతిలిపి,
కొలిమి, గోదావరి, కవితావరణం మొ.వి.
8.3 బ్లాగులు-తెలుగు సాహిత్యం
8.4 సోషల్ మీడియా – తెలుగు సాహిత్యం: ఫేస్ బుక్,
ఆర్కుట్ మొ.వి
8.5 వెబ్ సైట్లు-తెలుగు సాహిత్యం: వికీపీడియా మొ.వి.
9. నాటకం – వస్తు, రూప పరిణామం (2000-2020)
9.1 నాటకం – వస్తువైవిధ్యం
9.2 నాటకం – పాత్రచిత్రణ
9.3 నాటకం – ప్రాంతీయత: మాండలికత
అంశాల్లోని వస్తు-రూప సంవిధానాన్ని విశ్లేషించే వ్యాసాలను ఆహ్వానిస్తున్నాము. కేవలం 2000-2020 ల మధ్య వెలువరించబడిన/ప్రచురించబడిన రచనలను మాత్రమే పరిశీలనకు తీసుకుని పత్రాలు సమర్పించాలి. వ్యాస రచనలో తప్పనిసరిగా మెథడాలజీ పాటిస్తూ, చివర ఆధార గ్రంథాలు, రచనల ప్రచురణ మొ.న వివరాలు విధిగా పేర్కొనాలి.
నాణ్యమైన, ప్రామాణికమైన పరిశోధన పత్రాలను “నెచ్చెలి” అంతర్జాల పత్రికలో ప్రచురించగలం. మీ పరిశోధన పత్రాలను teluguweb2021@gmail.com అనే మెయిల్ ఐడికి 25/12/2020 లోపు పంపగలరు. ఆ తర్వాత పంపే పరిశోధన పత్రాలు ముద్రణకు తీసుకోబడవని గ్రహించగలరు. పరిశోధన పత్రాలను అను-7, ప్రియాంక ఫాంట్ 18, లైన్ స్పేస్ 21తో పేజీమేకర్ ఫైల్ తో పాటు, తప్పనిసరిగా యూనికోడ్ ఫాంట్ తో
వర్డ్ ఫైల్ లో కూడా పంపాలి. పరిశోధనా పత్రం 5 పేజీలు మించకుండా ఉండాలి. పిడియఫ్ లు పరిగణనలోకి తీసుకోబడవు.
సదస్సులో పాల్గొనటానికి పత్ర సమర్పణ నిమిత్తం రిజిస్ట్రేషన్ ఫీజు విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు రూ.300/-, ఉపాధ్యాయులు రూ.500/- గూగుల్ పే/ పేటిఎం నెం: 9449672394 కు చెల్లించాలి.
చరిత్రలో నిలిచిపోయే ఉత్తమ పరిశోధనా గ్రంథంగా ఈ సదస్సు ప్రత్యేక సంచిక ముద్రితం కానుంది.
ప్రత్యేక సంచిక కావలసిన వారు విడిగా సంచిక ఖరీదు చెల్లించి కొనుక్కోవాలి.
ఈ కింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు.
వివరాలకు:
ఆచార్య కె. ఆశాజ్యోతి
తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులు, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు
ఫోన్: 9449672394; మెయిల్ ఐడి: teluguweb2021@gmail.com
&
డా. కె. గీత
కంప్యూటేషనల్ లింగ్విస్ట్, ఆపిల్, కాలిఫోర్నియా, యు.ఎస్.ఏ.
కవయిత్రి & సంస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక




 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు