తెలుగు అకాడమీ -హైదరాబాద్

 

తెలుగు అకాడమీ,హైదరాబాద్

గ్విన్ కమిటీ (1966) నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర తెలుగు సంస్థగా ‘తెలుగు అకాడమీ’(1968)ని స్థాపించింది. తెలుగు అకాడమీ మూడు ప్రధాన లక్ష్యాలతో కృషి చేస్తుంది.అవి:

Ø  ఉన్నత విద్యకు సంబంధించిన అన్నీ స్థాయిలలోనూ అంటే ఇంటర్,డిగ్రీ,పి.జి.స్థాయిలలో తెలుగును బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టి,వ్యాప్తి చేసే కృషిలో విశ్వవిద్యాలయాలకు సహకరించడం.

Ø  అధికార భాషగా తెలుగు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసే కృషిలో సహకరించడం.

Ø  తెలుగు భాషను ఆధునీకరించి సుసంపన్నం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రమాణీకరించడం,భాషా పరిశోధనలు నిర్వహించడం.

అకాడమి స్థాపన జరిగిన నాటి నుంచి ఉన్నత విద్యాస్థాయిలో బోధనాభాషగా తెలుగు కుదురుకోవడంలో తెలుగు అకాడమీ నిర్వహిస్తున్న పాత్ర అందరికీ తెలిసిందే.ఎన్నో రకాల ఇబ్బందులను అధిగమిస్తూ అత్యల్ప వ్యవధిలో ఇంటర్,డిగ్రీ,పి.జి. స్థాయిలకు కావాల్సిన పాఠ్య, పఠనీయ గ్రంథాలు, అనుబంధ గ్రంథాలుగా అనువాదాలు, మోనోగ్రాఫ్ లు, జనరంజక గ్రంథాలు, వ్యాసావళులు,కరదీపికలు,ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకు కావాల్సిన గ్రంథాలు,పారిభాషిక పదకోశాలు,శాస్త్ర నిఘంటువులు,ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రత్యేక సంచికలు విడుదల చేసి తెలుగు భాషకు విద్యారంగానికి ఎంతో సేవ చేయగలగింది.

తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రాలు

ప్రాంతీయ కేంద్రం/చిరునామా

ఈ కేంద్రం పరిధిలోని జిల్లాలు

1.హైదరాబాద్

తెలుగు అకాడమీ,

హిమాయత్ నగర్, హైదరాబాద్-500 029

ఫోన్ నం.040-23225215,సెల్: 95811-11706

ఫాక్స్ నం.040-23225359

నల్గొండ,మహబూబ్ నగర్,రంగారెడ్డి, హైదరాబాద్,కరీంనగర్,

ఆదిలాబాద్,నిజామాబాదు

2.వరంగల్లు

ఇం.నెం.2-10-483/1,కనకదుర్గ కాలనీ,వడ్డేపల్లీ,

హనుమకొండ-506 001

ఫోన్ నం.0870-2459550,

సెల్:95811-00446

వరంగల్లు,ఖమ్మం

3.సంగారెడ్డి

ఇం.నెం.3-5-5,వీరభద్ర నగర్,కొత్త బస్టాండ్ దగ్గర,సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా -502 001

ఫోన్ నం.08455-274528

మెదక్,సంగారెడ్డి

4. సిద్దిపేట

ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల

హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్కన, సిద్దిపేట

సిద్దిపేట జిల్లా-502103

సెల్ నం.8142289170

మెదక్,సిద్దిపేట

5. విజయవాడ

డోర్ నం.31-3-4బి. గ్రౌండ్ ఫ్లోర్(వెనుక భాగం)

మారుతీనగర్,వియజవాడ-520 004

ఫోన్ నం.0866-2441669,సెల్ నం. 95811-11704

కృష్ణా,పశ్చిమ గోదావరి,ప్రకాశం

6.విశాఖపట్టణం

డాక్టర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్ వెనుక,

విశాఖపట్టణం-530 003

ఫోన్ నం.0891-2575650,

సెల్ నం.95811-00442

విశాఖపట్టణం,విజయనగరం,శ్రీకాకుళం,తూర్పు గోదావరి

7.తిరుపతి

శ్రీ కోదండ రామస్వామి ఉన్నత పాఠశాల

సబ్ కోర్టు ఎదురుగా,తిరుపతి-517 501

ఫోన్ నం.0877-2251409

సెల్ నం.95811-00444

చిత్తూరు,నెల్లూరు,కడప

8.అనంతపురం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల

అనంతపురం-515 001

ఫోన్ నం.08554-240840

సెల్ నం.95811-00445

అనంతపురం,కర్నూలు

9.గుంటూరు

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల

గుంటూరు-522 001

ఫోన్ నం. 0863-2214951

సెల్ నం. 95811-00447

గుంటూరు

 సేకరణ:తెలుగు అకాడమీ-ప్రచురణల పట్టిక

Download in pdf :click here