పాలపిట్ట-డా.అమృతలత సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీ-చివరితేదీ - 15 అక్టోబర్‌ 2021

తెలుగువారి అతి పెద్ద పండుగ దీపావళి. ఈ సందర్భంగా దీనిని ఒక సాహిత్య ఉత్సవంగా మలచాలన్న సంకల్పంతో పాలపిట్ట-డాక్టర్‌ అమృతలత  సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథలపోటీని నిర్వహించాలని పాలపిట్ట సంపాదకవర్గం నిర్ణయించింది. మంచి కథలని ప్రోత్సహించే లక్ష్యంతో తలపెట్టిన ఈ పోటీలో పాల్గొనవలసిందిగా కథకులని ఆహ్వానిస్తున్నాం.

బహుమతులు
మొదటి బహుమతిః రూ. 10,000
రెండో బహుమతిః రూ. 6000
మూడో బహుమతిః రూ. 4000
పది ప్రత్యేక బహుమతులు
ఒక్కొక్క కథకి రూ. 1000
 
 నిబంధనలు
_ ఇతివృత్తం ఆయా రచయితల, రచయిత్రుల ఇష్టం. జీవితం విశాలమైంది. మానవ జీవితం అనేక అనుభవాల సమాహారం. కనుక ఎలాంటి ఇతివృత్తం ఎంచుకోవాలో కథకుల నిర్ణయానికి వదిలేస్తున్నాం. తీసుకున్న వస్తువును కథగా మలచడంలో చూపిన ప్రతిభకే ప్రాధాన్యం.
-  ఏం చెప్పారన్నదే కాక ఎలా చెప్పారన్నదే ఈ పోటీలో ప్రముఖంగా పరిగణనలోకి తీసుకునే అంశం. ఇతివృత్తాన్ని ఎంత అందంగా, పఠిత మనసుని ఆకట్టుకునేలా చెప్పారన్నదే ముఖ్యం.
- పోటీకి పంపించే  కథలకు ఎలాంటి పేజీల పరిమితి లేదు. కథ రాయాలనుకునే వారికి ఇన్నిపేజీలలోనే రాయాలని నిబంధన విధించడం సరి కాదని పాలపిట్ట భావిస్తున్నది.  తాము చెప్పదలచుకున్న కథని ఒక పేజీలో చెబుతారా ఇరవై, ముప్పయి లేదా అంతకన్నామించిన పేజీలలో చెబుతారా అనేది కథకుల సృజనాత్మక స్వేచ్ఛకు సంబంధించిన అంశం. అందుకే ఈ కథలపోటీలో పాల్గొనే కథకులకు ఎలాంటి పరిధులు, పరిమితులు లేవు.
- పోటీకి పంపించే కథలు సొంత కథలయి ఉండాలి. అనువాదాలు కాదు. అలాగే ఇదివరలో ఎక్కడా ప్రచురితం,ప్రసారితం కాకూడదు. సోషల్‌ మీడియాలోగానీ, ఇతర వెబ్‌సైట్లలో గానీ ప్రచురితమై ఉండరాదు. ఈమేరకు కథతోపాటు హామీపత్రం పంపించాలి.

మీ కథలు చేరడానికి చివరితేదీ - 15 అక్టోబర్‌ 2021
మీ కథలని పోస్టు చేయవచ్చు లేదా మెయిల్‌లోనూ పంపవచ్చు.
చిరునామాః ఎడిటర్‌, పాలపిట్ట
ఎఫ్‌-2, బ్లాక్‌ -6, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044
ఫోనుః 9490099327
Email: palapittamag@gmail.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు